
బ్యారెల్ ముడి చమురు @120 డాలర్లు!
పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఇరాన్ యుద్ధం ముదరడంతో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి, ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 119.50 డాలర్ల మార్కును తాకాయి. రెండో వారంలోనూ చమురు నిల్వలు, రవాణా మార్గాలే లక్ష్యంగా దాడులు కొనసాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది.



















































